మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఏసీబీ వలలో చిక్కారు. ప్రభుత్వ భూములను కాజేశారంటూ ఆరోపణలు రాగా.. ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.వందల కోట్ల ఆస్తులు బయటికి వచ్చాయి. ప్రభుత్వ భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి.. రియల్టర్లకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రియల్టర్ల నుంచి ప్లాట్లను గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు తేలింది. ఇక వంశీమోహన్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.