ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. పలు కీలక నిర్ణయాలు

1 month ago 15
రాష్ట్రంలోని ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీఎం .. కీలక అంశాలపై ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇచ్చారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపుల కోసం వంద రోజులలో రూ.6వేల కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగానిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే జూన్ ఒకటో తేదీలోగా తెలంగాణలోని ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Entire Article