తెలంగాణ సంస్కృతిలో భాగమైన తాటి కల్లు, నీరాకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పానీయాలను ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని.. ప్రభుత్వ నర్సరీల ద్వారా తాటి, ఈత మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 24న చిలుకూరులో నిర్వహించే 'తాటి మేళా' ప్రాధాన్యతను ఆయన వివరించారు.