పోలీసు శాఖలో కీలక మార్పులు.. కొత్త డీఎస్పీల రాకతో సీనియర్ల పదోన్నతులకు మార్గం

2 weeks ago 12
తెలంగాణ పోలీసు శాఖలో అధికారుల కొరత తగ్గించే దిశగా చర్యలు మొదలయ్యాయి. శిక్షణ పూర్తి చేసుకున్న 112 మంది కొత్త డీఎస్పీలు మరికొన్ని నెలల్లో విధుల్లోకి రానున్నారు. 1995, 1996 బ్యాచ్‌ల పదోన్నతుల వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డీజీపీ సీవీ ఆనంద్‌ చర్చల అనంతరం పలువురు అధికారులు కోర్టు కేసులను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 37 అదనపు ఎస్పీ పోస్టులను భర్తీ చేస్తే డీఎస్పీ స్థాయిలోనూ ఖాళీలు ఏర్పడతాయి. దీంతో పదోన్నతులు, అధికారుల సర్దుబాటుకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.
Read Entire Article