Polavaram Non Tribal House Assistance Increased: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గిరిజనేతర నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గిరిజనేతరులకు ఇంటి నిర్మాణ సాయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.3.85 లక్షలు ఉన్న సాయాన్ని తాజాగా రూ.5.57 లక్షలకు పెంచింది. ఈ డబ్బుల్ని వన్ టైం సెటిల్‌మెంట్ కింద అందజేస్తారు. నిన్నటి వరకు 2017-18 సంవత్సరం నాటి ధరల ప్రకారం చెల్లింపులు చేసేవారు.