పోలవరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎటపాక మండలంలోని గొల్లగూడెం వద్ద చేపల కోసం గోదావరి నదిలోకి దిగి ఐదుగురు మృతి చెందారు. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు చేపల వేట కోసం గోదావరి నదిలోకి దిగారు. అయితే లోతుగా ఉండటంతో నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐదు మృతదేహాలను గుర్తించారు.