బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ పోక్సో కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు.. మరింత సమాచారాన్ని సేకరించేందుకు కోర్టు ఇచ్చిన అనుమతితో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌ను 3 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ జరపనున్నారు. దీంతో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయా అని పోలీసులు ఎదురుచూస్తున్నారు.