తెలంగాణలో పెరుగుతున్న పంట వ్యర్థాల దహనం ఘటనలు, ప్రాణ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కూలీల కొరత, పశువుల సంఖ్య తగ్గడం వల్ల రైతులు వ్యర్థాలను తగులబెడుతుండటంతో భూపాలపల్లి, నిర్మల్, హనుమకొండ జిల్లాల్లో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో శాటిలైట్ నిఘా ద్వారా పంట వ్యర్థాలు తగులబెట్టేవారిని గుర్తించి ఎన్జీటీ నిబంధనల ప్రకారం రూ.2500 నుంచి రూ.15 వేల వరకు జరిమానాలతో పాటు, ఎయిర్ యాక్ట్ కింద మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.