పేదోడి కార్పొరేట్ హాస్పిటల్ నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా సీనియర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్

1 month ago 12
హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నూతన డైరెక్టర్‌గా సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆయనను మూడేళ్ల కాలానికి డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ నగరి బీరప్ప నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిమ్స్‌లో రోగులకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ పేర్కొన్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి, రోబోటిక్ శస్త్రచికిత్సల్లో సుదీర్ఘ అనుభవం ఉంది.
Read Entire Article