Fight For Salt In A Wedding In Marakapur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లిలో జరిగిన పెళ్లిలో గొడవ జరిగింది. భోజనాల సమయంలో సాంబారులో ఉప్పు తక్కువైందని బంధువులు గొడవపడ్డారు. ముందు వాగ్వాదానికి దిగినవారు.. చివరికి రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటలో ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.