పులివెందులలో బీటెక్ రవికి షాక్.. ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్థులు

7 months ago 23
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవికి చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో కొంతమంది టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారికి కండువాలు కప్పేందుకు బీటెక్ రవి అమ్మగారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. అయితే ఇందుకు నిరసనగా ఊరిజనం ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ ఇలాఖాలో టీడీపీ జెండాను ఎగరవేయాలని బీటెక్ రవి పట్టుదలగా ఉన్నారు.
Read Entire Article