ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వానలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు మంగళవారం రోజున విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉరుములతో వానలు పడేటప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.