ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే తమతో కలిసి రావాలి అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదని.. అభివృద్ధి కోసమేనని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రధాని మోదీతో కలిసి వెళ్లేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.