పార్కులో జింకల వేట.. వీడిన మిస్టరీ.. ఆ మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అరెస్ట్..

7 months ago 23
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసులో మరో ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు ఉన్నాడు. గత నెలలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడినట్లు డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ వేటకు అటవీ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ సహకరించినట్లు తేలడంతో.. అతడిని సస్పెండ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు, వన్యప్రాణి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article