Varattanapalli Shivalayam Rs 55 Lakhs From TTD: అల్లూరి సీతారామరాజు పాడేరు మండలం వర్తనపల్లి శివాలయానికి టీటీడీ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఈ ఆలయ పునర్ నిర్మాణం కోసం టీటీడీ రూ.55 లక్షలు మంజూరుచేసింది. ఈ ఏడాది మార్చి 14న పవన్ కళ్యాణ్ పాడేరులో పర్యటించారు. ఆ సమయంలో శివాలయాన్ని దర్శించుకున్నారు. స్థానికులు ఆలయ అభివృద్ధికి నిధులు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ శివాలయం అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.. ఈ మేరకు టీటీడీ నిధులు విడుదల చేసింది.