మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు గవర్నర్ పదవి సిఫార్సు చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కైకలూరులో జనసేన మీటింగ్‌లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్.. 2024 ఎన్నికలకు ముందు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ముద్రగడకు గవర్నర్ పదవి సిఫార్సు చేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నాదెండ్ల గుర్తు చేసుకున్నారు.