Annamreddy Adeep Raj Building Demolished: విశాఖపట్నంలో కూల్చివేతల అంశంపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ భవనంలోని సెల్లార్, పెంట్ హౌస్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఆ భవనాన్ని పరిశీలించారు. ఇదే భవనంలో సత్యానందం యాక్టింగ్ స్కూల్ నడిచింది.. ఇక్కడే పవన్ కళ్యాణ్, ప్రభాస్‌తో పాటు చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు.