జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీలను రద్దు చేశారు. క్రమశిక్షణ లోపించటం, పార్టీ విధి విధానాలను ఉల్లంఘించేలా ప్రవర్తిస్తూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలో కమిటీలను రద్దు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ప్రకటన విడుదలైంది.