ప్రధాని మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సింధు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ తన హైదరాబాద్ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.