పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమారులు అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించారు. విఠంరాజుపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి పరిశీలించారు. బాధితురాలి మేనమామ ఫిర్యాదు ఆధారంగా మహిళ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.