పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం.. సీఎం ఆదేశాలు

3 months ago 19
ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సత్యనారాయణపై దాడి విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సీఎం ఆదేశాలతో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు.. దుశ్చర్లకు ఫోన్ చేశారు. ఆరోగ్యం గురించి కనుక్కున్నారు. ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దుశ్చర్ల సత్యనారాయణపై కొంతమంది గొర్రెల కాపర్లు దాడి చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article