మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. వారిని విమానంలో 2 రోజుల పాటు ట్రిప్‌కు పంపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు.. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద.. ఎన్నో కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు అందిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా వారికి ఊహించని బహుమతి అందించారు.