పండగ వేళ తీవ్ర విషాదం.. రైలు ఎక్కుతూ జారిపడి ఏఎస్సై మృతి

9 months ago 20
పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాండూరు రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కలబురిగి జిల్లాకు చెందిన ఏఎస్సై మారుతి, విధులకు హాజరయ్యేందుకు యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా కాలు జారి రైలు కింద పడ్డారు. రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వివరాలు..
Read Entire Article