హైదరాబాద్‌కు చెందిన జీఎంఆర్ ఏరో టెక్నిక్, బోయింగ్ డిఫెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భారత నావికాదళానికి చెందిన 'పి-8ఐ' సముద్ర నిఘా విమానాలకు హెవీ మెయింటెనెన్స్ పనులను జీఎంఆర్ చేపట్టనుంది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఈ విమానాలకు స్ట్రక్చరల్ అప్‌గ్రేడ్స్, పెయింటింగ్, సిస్టమ్ తనిఖీలు నిర్వహిస్తారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా జీఎంఆర్ ప్రతినిధులు చెబుతున్నారు.