ఈసారి మార్కెట్‌లో ఎక్కడ చూసినా నేరేడు పళ్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. శరీరానికి ఎంతో మంచి చేసే నేరేడు పళ్లు తినేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే ఈ నేరేడు పళ్లే ఇప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేరేడు పళ్లు ఎక్కువ కాయడమే.. ఈ ఏడాది తీవ్ర కరువు రావడానికి సంకేతం అంటూ కొందరు పేర్కొంటున్నారు. దీంతో అసలు ఈ నేరేడు పళ్లకు, కరువుకు సంబంధం ఏంటి. ఆ మిస్టరీ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.