ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కీలక విజ్ఞప్తి చేసింది. వరిలో పీఆర్ 126, 1010 రకాలను సాగు చేయవద్దని కోరింది. ఈ రెండు రకాలలో నూకల శాతం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉందని.. ఈ నేపథ్యంలో కొనుగోలు సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని రైతులు ఈ రెండు రకాలను సాగు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకూ 19.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు.