నిమ్స్ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు: డైరెక్టర్ విజ్ఞప్తి

3 weeks ago 8
నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ అంటూ వస్తున్న వార్తలపై నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఆస్పత్రిపై బురదజల్లాలనే దురుద్దేశంతో కొంతమంది స్వార్థపూరితంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కిడ్నీ ఆపరేషన్ కోసం ఓ రోగి నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నారంటూ ఫిర్యాదు అందిందని.. ఆ ఉద్యోగిని వెంటనే విధుల నుంచి తప్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Entire Article