రాష్ట్రంలో ఎండలు, వడగాలులు తీవ్రరూపం దాల్చాయి. నల్గొండలో గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 జిల్లాల్లోని 145 మండలాల్లో వడగాలులు వీచాయి. రాబోయే మూడు రోజులు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మరో వైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 5 తర్వాత తెలంగాణను తాకనున్నాయన్నారు. దీనివల్ల జులై-సెప్టెంబర్ వర్షాలపై ప్రభావం పడనుందని చెప్పారు.