రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కల్తీని కట్టడి చేసేందుకు హైడ్రా తరహాలో ఒక స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్‌ను ఈ ఫోర్స్‌కు బాస్‌గా నియమించి.. పలు శాఖల అధికారులను కేటాయించనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ స్పెషల్ ఫోర్స్ ప్రతిపాదనలు రెడీ కాగా.. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.