నారాయణఖేడ్‌లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపి, జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య

1 week ago 5
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఒక దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే కల్పన అనే మహిళ తన ప్రియుడు చింటూతో కలిసి భర్త ముత్యంరెడ్డిని అత్యంత క్రూరంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని జేసీబీ సహాయంతో గ్రామ శివారులో పూడ్చిపెట్టి భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాలు ఆడింది. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల విచారణలో నిందితురాలి గుట్టు రట్టయింది. హత్య జరిగిన 9 రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Entire Article