గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి.. తన 8 ఏళ్ల ప్రేమ విఫలం కావడంతో ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు రాసిన చివరి లేఖలో తన మృతదేహానికి తన ప్రియుడే తాళి కట్టాలని కోరింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి నిరసన చేపట్టారు. అయితే వారి రాక విషయం ముందే తెలుసుకున్న యువకుడి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.