TTD Trust Board Member Sudarshan Venu TTD Darshan Letters: తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజూ దాదాపుగా లక్షమంది వరకు తిరుమలకు వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ పాలకమండలి సభ్యడు, టీవీఎస్ మోటార్స్ ఎండీ సుదర్శన్ వేణు తన దర్శనం, వసతి గదుల సిఫార్సు లేఖల్ని 50శాతం వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సుదర్శన్ వేణు టీటీడీకి లేఖ రాశారు.