నంద్యాల - ఒంగోలు జాతీయ రహదారి పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రవాగులో వజ్రాల వేట మొదలైంది. పెద్దగా వర్షాలు కురవకపోయినా.. గతంలో కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతం నుంచి నీరు వచ్చింది. దాంతో అడవిలోని వజ్రాలు వాగుతో సహా కొట్టుకొచ్చి ఉంటాయనే కారణంతో స్థానికులు వజ్రాల అన్వేషణ మొదలుపెట్టారు. నీటి అడుగు భాగంలో వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. కడప, కర్నూలు, మార్కాపురం జిల్లా ప్రజలు ఎక్కువగా అన్వేషిస్తున్నారు.