నన్నే ప్రశ్నిస్తావా.. కర్రతో ఎంఈఓపై దాడి చేసిన స్కూల్ టీచర్..

8 months ago 23
ఇల్లందు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఉమాశంకర్‌పై ఉపాధ్యాయుడు శంకర్ దాడి చేయడం విద్యా వ్యవస్థలో కలకలం రేపింది. రిజిస్టర్‌లో మధ్యాహ్నం సంతకం ముందుగా చేయడాన్ని ఎంఈఓ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు శంకర్, విచక్షణ కోల్పోయి కర్రతో విద్యాధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎంఈఓ చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎంఈఓ ఉమాశంకర్ పోలీసులకు.. జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయడంతో, ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article