తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల అక్రమ మార్పులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రత్యేక విచారణ కమిటీ (సెట్) రిపోర్ట్, ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 15 బృందాలతో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, జనగామ, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ధరణి ఆపరేటర్లను విచారించింది. మొదట నలుగురిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య జరిగిన సుమారు 8 లక్షల లావాదేవీల్లో 22 వేల వరకు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఆడిట్‌లో గుర్తించినట్లు సమాచారం.