ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ బయల్దేరినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన దువ్వాడ.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని చెప్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.