పోలవరం ప్రాజెక్టు, దాని ముంపు ప్రాంతాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పోలవరం అగ్గి రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను తక్షణమే ఆపాలంటూ.. తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రేవంత్ సర్కార్ లేఖ రాసింది. పోలవరం పూర్తి స్థాయి సర్వే అయిపోయే వరకు నిర్మాణ పనులు ఆపాలని స్పష్టం చేసింది.