ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద తెలంగాణకు అదనంగా 8,338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. దీని కోసం రూ.125.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. తొలి విడతగా రూ.50.02 కోట్లు విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరు, మందకొడి నిధుల వినియోగంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాత పథకం కింద పెండింగ్‌లో ఉన్న ఇళ్లను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో కేంద్ర సాయం నిలిచిపోతుందని హెచ్చరించింది.