తెలంగాణలో మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు పేరిట జిల్లా..? ఆ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్స్..

6 months ago 33
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. గతంలో జరిగిన విభజన అశాస్త్రీయమని మంత్రి అనడంతో.. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదనే 'పీవీ నరసింహారావు జిల్లా'గా ఏర్పాటు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పరిపాలన ప్రజలకు దగ్గరవ్వాలంటే హుజూరాబాద్ జిల్లా కేంద్రం కావడం అవసరమని నాయకులు స్పష్టం చేశారు. మంత్రి హామీ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Entire Article