Telangana Anganwadi Jobs Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీలలో భఆరీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు అంగన్‌వాడీలలో ఉన్న ఖాళీల వివరాలను సేకరించారు.. 2025-2026నాటికి ఉన్న ఖాళీలతో ఈ ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం 15,982 పోస్టుల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంతేకాదు అంగన్‌వాడీలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కనెక్షన్లు, వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు.