తెలంగాణలో భగ్గమంటున్న భానుడు... వడదెబ్బతో 45 మంది మృతి, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

1 month ago 11
తెలంగాణలో ఎండల తీవ్రత పగటితో పాటు రాత్రి వేళల్లోనూ అసాధారణంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరగడంతో రాత్రిపూట కూడా వేడిగాలులు వీస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 45 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మంలో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణశాఖ పది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
Read Entire Article