తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత..? పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన

2 months ago 25
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పౌర సరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని స్పష్టం చేసింది. ప్రతిరోజూ సుమారు 24 వేల కిలోలీటర్ల చమురు, 2.22 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా జరుగుతోందని గణాంకాలతో వివరించింది. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Read Entire Article