తెలంగాణలో తొలిసారి బ్యాటరీ ఇంధన నిల్వ ప్లాంట్లు.. ఎకరా భూమి లీజు కేవలం ఒక్క రూపాయికే..

15 hours ago 2
తెలంగాణలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా.. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో 1500 మెగావాట్ల సామర్థ్యంతో సరికొత్త బ్యాటరీ ఇంధన నిల్వ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ట్రాన్స్‌కోకు చెందిన ప్రభుత్వ భూములను ఏడాదికి ఎకరాకు కేవలం రూ.1 చొప్పున 15 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇవ్వనున్నారు. ఈ టెండర్ల ఆమోదం కోసం జెన్‌కో, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి పిటిషన్ సమర్పించింది.
Read Entire Article