Telangana First Glass Bridge In Husnabad: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని చెరువులో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. లవ్ సింబల్ ఆకారంలో చూడటానికి బావుంది.. ఈ బ్రిడ్జి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయినా సరే జనాలు ఈ బ్రిడ్జిని చూడటానికి తరలివస్తున్నారు. అన్ని కుదిరితే రెండు, మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జి దగ్గర ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.