తెలంగాణలో కొత్తగా మరో RTC బస్ డిపో.. ఈ ప్రాంతంలోనే, తీరనున్న రవాణా కష్టాలు

1 year ago 33
తెలంగాణ ప్రభుత్వం TGSRTC బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజారవాణాను మెరుగుపరచడానికి కొత్త బస్సులు, డిపోలు, బస్ స్టేషన్ల ఆధునీకరణ, నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. నేడు ములుగు జిల్లా ఏటూరునాగారంలో రూ.4.5 కోట్లతో 99వ ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేశారు. ఈ డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన ప్రజా రవాణా అందించడమే తమ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి పొన్నం వెల్లడించారు.
Read Entire Article