తెలంగాణలో కొత్త వ్యవసాయ కార్యక్రమం.. నేటి నుంచి పొలాల్లోకి ఆవిష్కరణలు

1 week ago 7
ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత, పంటల విస్తీర్ణం తగ్గడం, చీడపీడల సమస్యలను ఎదుర్కొంటున్న తెలంగాణ రైతులకు అండగా రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు కార్యక్రమం ప్రారంభం కానుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 12 పరిశోధన కేంద్రాల పరిధిలో రెండేళ్లపాటు అమలు చేయనున్నారు. శాస్త్రవేత్తలు రైతుల పొలాలను సందర్శించి భూసార పరీక్షలు, ఆధునిక వంగడాల ఎంపిక, పంటల సాగు నుంచి కోత వరకు సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తారు. అపరాలు, నూనెగింజల సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article