Andhra Pradesh ZPTC Mptc Election Polling Today: ఏపీలో నేడు 582 జెడ్పీటీసీ.. 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ నిర్వహించనున్నారు. పోటీలో 21,012 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో.. 5 మండలాల్లో పోలింగ్ వాయిదా వేశారు. ఎన్నికల విధుల్లో దాదాపు 2.52 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.