తెలంగాణలో త్వరలోనే కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. డోర్నకల్ జంక్షన్-భద్రాచలం రోడ్ మధ్య 54.43 కిలోమీటర్ల డబుల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. రూ.770.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ డబ్లింగ్ లైన్ వల్ల భద్రాచలం రామాలయానికి వెళ్లే భక్తులకు రవాణా సులువవడంతో పాటు రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది.