తెలంగాణ నుంచి గోవాకు వెళ్లాలనుకునేవారికి తీపి కబురు. వికారాబాద్-కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. రూ.2,844.60 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రస్తుతం రైల్వే బోర్డు ఆమోదం కోసం పీఈసీ పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 10.09 శాతం ఆర్థిక రాబడి వస్తుందని అంచనా వేయడమే కాకుండా.. భూసేకరణ ఖర్చును భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి తోడు గోవాకు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధమవుతుంది.