కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇక పింఛన్ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెన్షన్ల జాబితా నుంచి అనర్హుల పేర్లను ఏరివేసి.. అర్హులకే అందించేలా చర్యలు చేపడుతున్నారు.